|
|
Dilip Kumar Cultural Academy ‘Padmasri Ghantasala Aaradhanotsavam’ on 7th June 2012 at Ravindra Bharathi రవీంద్రభారతిలో ఘనంగా జరిగిన ‘పద్మశ్రీ కీ.శే. ఘంటసాల ఆరాధనోత్సవం’
|
|
||||
Dilip Kumar Cultural Academy ‘Padmasri Ghantasala Aaradhanotsavam’ on 7th June 2012 at Ravindra Bharathi
రవీంద్రభారతిలో ఘనంగా జరిగిన ‘పద్మశ్రీ కీ.శే. ఘంటసాల ఆరాధనోత్సవం’
సాంస్కృతిక మండలి వారి ఆశీస్సులతో పూజా మీడియా & మార్కెటింగ్ ఈవెంట్స్ సమర్పణలో దిలీప్ కుమార్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో ‘పద్మశ్రీ కీ.శే. ఘంటసాల ఆరాధనోత్సవం’ 7 జూన్ 2012న రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఘంటసాల సినీ సంగీత విభావరి ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రివర్యులు గౌ. శ్రీ దామోదర రాజనరసింహ గారు విచ్చేసారు. జ్ఞానపీఠ అవ్రాడు గ్రహీత, పద్మభూషణ్ డా. సి. నారాయణరెడ్డి గారు సభను ప్రారంభించారు. సాంస్కృతిక మండలి చైర్మన్ ఆర్.వి. రమణమూర్తి గారు అధ్యక్షత వహించారు. గౌరవ అతిథులుగా సాంస్కృతిక శాఖ సలహాదారులు ఐ.ఏ.ఎస్. డా. కె.వి. రమణాచారి, డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ జువెనిల్ వెల్ఫేర్ కరక్షనల్ సర్వీసెస్ & వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ ఎ.ఎల్. కిస్మత్ కుమార్, సినీ దర్శకులు ఎన్. శంకర్, అంతర్జాతీయ సాయి సమాజం అధ్యక్షులు వేముల సుధాకర్ గుప్తా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాలికల సదనం తిరుపతి వారు సమర్పణలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అమ్మవారి నాటిక ప్రదర్శన అలరింపుగా సాగింది. దిలీప్ కుమార్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఘంటసాల సినీ సంగీత విభావరి ఆకట్టుకుంది. ఘంటసాల సినీ సంగీత విభావరిలో ఆలపించిన గాయనీగాయకులు దిలీప్ కుమార్, ఆమంత, చిమలపాటి హైమావతి, సూర్యకుమారి, సునంద, నాగేశ్వరి, జ్యోతి, పూర్ణచంద్రరావు, ఇందుపురం సుగుణబాయి.
కార్యక్రమంలో ఘంటసాల సంగీత బృందంలో వయోలిన్ విద్వాంసులుగా తమ ప్రతిభను చూపిన సుప్రసిద్ధ సంగీత దర్శకుడు మణిశర్మ తండ్రి యనమండ్ర సుబ్రహ్మణ్య శర్మను, సంగీత దర్శకుడు మణిశర్మ లను డా. సి. నారాయణరెడ్డి ఘనంగా సత్కరించారు. నృత్యకళాకారిణి, లలిత సంగీతజ్ఞురాలు, గాయని హిందూపురం సుగుణబాయిని సత్కరించారు.
ఈ సందర్భంగా జ్ఞానపీఠ అవ్రాడు గ్రహీత, పద్మభూషణ్ డా. సి. నారాయణరెడ్డి గారు మాట్లాడుతూ
అమరగాయకుడు, పద్మశ్రీ ఘంటసాల గానం అజరామరం అని, ఆయన భారతావని కీర్తి కిరిటీ అని పలికారు. సుబ్రహ్మణ్య శర్మతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
సాంస్కృతిక శాఖ సలహాదారులు ఐ.ఏ.ఎస్. డా. కె.వి. రమణాచారి మాట్లాడుతూ
ఘంటసాల ఆరాధనోత్సవంతో పాటు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అమ్మవారి నాటిక ప్రదర్శించడం ప్రశంసనీయమని అన్నారు.
సత్కార గ్రహీత యనమండ్ర సుబ్రహ్మణ్య శర్మ (మణిశర్మ తండ్రి) మాట్లాడుతూ
ఘంటసాల బృందంలో లవకుశ, మాయాబజార్ లాంటి చిత్రాలకు అందించిన సంగీతంలో వయోలిన్ ద్వారా తమ వంతు సేవలను అందించినందుకు గర్వపడుతున్నానని తెలిపారు.
కార్యక్రమంలో సంగీత దర్శకుడు కోటి, నటుడు ఏవిఎస్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

No videos
|
||||
No Google Map

Dilip Kumar Cultural Academy Padmasri Ghantasala Aaradhanotsavam at Ravindra Bharathi 2
Dilip Kumar Cultural Academy Padmasri Ghantasala Aaradhanotsavam at Ravindra Bharathi Invitation
Dilip Kumar Cultural Academy Padmasri Ghantasala Aaradhanotsavam at Ravindra Bharathi Invitation 2
Dilip Kumar Cultural Academy Padmasri Ghantasala Aaradhanotsavam at Ravindra Bharathi