|
|
Telugu Vennela Kinnera Kavitha Mahotsavalu Closing Ceremony on 23rd May 2012 at Ravindra Bharathi రవీంద్రభారతిలో ఘనంగా ముగిసిన తెలుగు వెన్నెల కిన్నెరా కవితా మహోత్సవాలు
|
|
||||
Telugu Vennela Kinnera Kavitha Mahotsavalu Closing Ceremony on 23rd May 2012 at Ravindra Bharathi
రవీంద్రభారతిలో ఘనంగా ముగిసిన తెలుగు వెన్నెల కిన్నెరా కవితా మహోత్సవాలు
రవీంద్రభారతిలో ‘తెలుగు వెన్నెల’ కిన్నెరా ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కవితా మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి గారు విచ్చేశారు. మన పిల్లలకు మనం వేమన, సుమతీ లాంటి శతక పద్యాలను గానీ, వాటిలోని మర్మాన్ని గానీ తెలియచెప్పే పరిస్థితిలో లేము, వాటిని పఠింపచేసే పరిసితి కూడా లేకుండాపోయిందని అన్నారు. సమాజానికి రక్షకుడు కవి మాత్రమేనని, సభ్య సమాజ నిర్మాణంలో కవి అందించే సాహిత్యం నేటి తరాన్ని ఖచ్చితంగా అసుస రానీయంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అవధాని రాళ్ళబండి కవితా ప్రసాద్ గారిని ఘనంగా సన్మానించారు.
మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి తక్షణమే అనువదించాబడాలని, అలా చేసినపుడే తెలుగు కవుల, రచయితల సాహిత్య పటిమ ఇతర ప్రాంతాలకు, దేశాలకు విధితమవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడు ఆర్.వి.రమణమూర్తి, రాజీవ్ గాంధీ టెక్నాలజీకల్ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు ఆర్.వి.రాజకుమార్ తమ ప్రసంగాల్లో తెలుగు భాషా పరిరక్షణకు వర్ధమాన కవులు లోతైన విశ్లేషణ చేసి రచనలకు శ్రీకారం చుట్టాలని అన్నారు. అనువాద కవితా మహోత్సవం శీర్షికన చివరి రోజు వీరభద్రుడు ‘అనువాద కవిత్వం – దశ – దిశ’ అనే అంశంపై చేసిన కీలకోపన్యాసం సభికులను విశేషంగా ఆకర్షించింది.
అనువాదమే లేకపోతే కవిత్వమే లేదని తెలిపారు. అనువాదానికి నన్నయ దారి తెరిచాడని, 20వ శతాబ్దం మొత్తం అనువాద ప్రక్రియకే వినియోగించబడిందని అన్నారు. భూమి, స్వర్గం కలిసే చోటు ఒక్కటేనని, అది ‘కాళిదాసు అభిజ్ఞాన శాకుంతల’ అని పలువురు ఆంగ్ల కవులు వ్యాఖ్యానించిన విషయాన్నీ వీరభద్రుడు గుర్తుచేశారు. నన్నయ అనువాద వ్యూహాన్ని పాటించాడని, అప్పటి నుండి సంస్కృత గ్రంథాలన్నీ కాలక్రమేణా తెలుగులోకి అనువదింపబడుతూ వస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా వీరభాద్రుడిని, జస్టిస్ నరసింహారెడ్డి, కవితా ప్రసాద్, రఘురాం లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమ అనంతరం విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ అద్భుతంగా రచించి నోబుల్ బహుమతిని సాధించిన ‘గీతాంజలి’ కావ్యాన్ని ప్రఖ్యాత అవధాని, సాహితీమూర్తి డా.రాళ్ళబండి కవితా ప్రసాద్ తెలుగులోకి అనువదించిన ఈ రచనను నృత్య రూపకంగా ప్రదర్శించారు.

No videos
|
||||
No Google Map

Justic L Narasimha Reddy Launched Indra Sabha Sampradaya Kavitha Mahotsavam DVD
Kinnera Anuvada Kavitha Mahotsavam at Ravindra Bharathi
Kinnera Anuvada Kavitha Mahotsavam at Ravindra Bharathi 3
Geethanjali Kuchipudi Dance at Ravindra Bharathi
Kinnera Anuvada Kavitha Mahotsavam at Ravindra Bharathi 4
Telugu Vennela Kinnera Kavitha Mahotsavam Invitation Card 2
Telugu Vennela Kinnera Kavitha Mahotsavam Invitation Card 4
Rallabandi Kavitha Prasad in Kinnera Anuvada Kavitha Mahotsavam
Geethanjali Kuchipudi Dance Performance at Ravindra Bharathi
RV Ramana Murthy Mandali Buddha Prasad Justic L Narasimha Reddy & Rallabandi Kavitha Prasad
Telugu Vennela Kinnera Kavitha Mahotsavam Invitation Card
Anuvada Kavitha Mahotsavam at Ravindra Bharathi
Rallabandi Kavitha Prasad with Nrutya Kinnera Geetanjali Dancers
Rallabandi Kavitha Prasad in Kinnera Anuvada Kavitha Mahotsavam at Ravindra Bharathi
Nrutya Kinnera Geetanjali Kuchipudi Dance
Justic L Narasimha Reddy Felicitated Film Flower Media Solutions Director VUM Rao
Telugu Vennela Kinnera Kavitha Mahotsavam Invitation Card 3
Mandali Buddha Prasad Speech in Kinnera Kavitha Mahotsavam
Rallabandi Kavitha Prasad Felicitated RV Ramana Murthy
Rallabandi Kavitha Prasad in Kinnera Kavitha Mahotsavam
Kinnera Anuvada Kavitha Mahotsavam at Ravindra Bharathi 2
Nrutya Kinnera Geetanjali Kuchipudi Dance at Ravindra Bharathi
Mandali Buddha Prasad & Justic L Narasimha Reddy in Anuvada Kavitha Mahotsavam